News February 2, 2025

MHBD: అంగన్వాడీ ఆయాలకు శుభవార్త

image

టెన్త్ పాస్ అయినా ఆయాలకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు గణపురపు అంజయ్య అన్నారు. 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారికి ప్రమోషన్ కల్పించాలని CM రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆయాలు ఆందోళనలు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన అన్నారు.

Similar News

News February 2, 2025

ఇచ్చోడలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

మామడ (M) పులిమడుగుకు చెందిన తులసిరాం, రాజు శనివారం బైక్‌పై ఇంద్రవెల్లి (M) కేస్లాపూర్ నాగోబా జాతరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అధికవేగంతో ప్రయాణిస్తున్న వారి బైకు ఇచ్చోడ (M) దుబార్ పేట్ వద్ద లారీని తప్పించబోయి కిందపడింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాజు మృతి చెందాడని ఎస్సై తిరుపతి తెలిపారు.

News February 2, 2025

రంజీలో వివాదం: బ్యాటింగ్ చేసేందుకు జమ్మూకశ్మీర్ నిరాకరణ

image

బరోడా, జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆతిథ్య బరోడా జట్టు పిచ్‌ను రెండో రోజు రాత్రి మార్చేసిందని ఆరోపిస్తూ JK జట్టు 3వ రోజు బ్యాటింగ్ చేసేందుకు నిరాకరించింది. దీంతో సుమారు గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. మల్లగుల్లాల అనంతరం ఎట్టకేలకు బ్యాటింగ్ ఆడింది. చివరికి మ్యాచ్‌ను కశ్మీర్ 182 పరుగుల తేడాతో గెలిచింది.

News February 2, 2025

కల్వకుర్తి: కునుకు తీసిన గుడ్లగూబ

image

కల్వకుర్తి పట్టణం గాంధీనగర్ కాలనీ‌లోని ఓ దుకాణం వద్ద ఓ గుడ్లగూబ ఆదివారం కునుకు తీస్తూ కనిపించింది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిద్రపోతున్న గుడ్లగూబను కాలనీ ప్రజలు, అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు. అడవిలో ఉండే ఈ పక్షి కాంక్రీట్ జంగిల్‌గా మారిన పట్టణంలో కునుకు తీస్తూ కనిపించటంతో ఆసక్తి నెలకొంది. ఈ గుడ్లగూబను పలువురు కెమెరాలో బంధించారు.