News April 3, 2025
MHBD: అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారులకు ఏ ఇబ్బందులూ లేకుండా అన్నిఏర్పాట్లు చేయాలని, వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ఆర్ఆజీఎస్, పెన్షన్స్, యూనిఫామ్స్, సెర్ప్‌కు సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు.
Similar News
News December 23, 2025
మెదక్: ‘ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.6.46 కోట్లు జమ’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 509 మంది లబ్ధిదారులకు వారం రోజుల్లోనే రూ.6.46 కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. 4,529 మంది లబ్ది దారులకు ఇప్పటికే సుమారుగా రూ.90 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. మెదక్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై హౌసింగ్ పీడీ మాట్లాడారు.
News December 23, 2025
SRR కళాశాలలో బ్యూటీషియన్ కోర్సుకు గడువు పెంపు

KNR(D) SRR ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో బేసిక్ బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు ఈనెల 31 వరకు గడువు ఉన్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు తరగతులు జనవరి 2 నుంచి ప్రారంభమవుతాయని, ఫీజు రూ. 2,000గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్, జంతుశాస్త్ర విభాగాధిపతి డా. కామాద్రి కిరణ్మయిని సంప్రదించాలని సూచించారు.
News December 23, 2025
ADB: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

తెలంగాణా గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సమన్వయధికారి లలిత కుమారి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 21లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు.


