News July 8, 2025
MHBD: అమ్మాయిలూ.. ఆకతాయిలు ఏడిపిస్తున్నారా?

జామండ్లపల్లి జడ్పీహెచ్ఎస్‌లో షీ టీం SI సునంద ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంట, బయట ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను, యువతులను భయాందోళనకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. 8712656935కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. MHBD ఎస్పీ రామ్‌నాధ్ కేకన్ ఆదేశాల మేరకు ఈ సదస్సు నిర్వహించామన్నారు.
Similar News
News July 8, 2025
SKLM: మెగా పీటీఎం 2.0 పై దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

జూలై 10న నిర్వహించబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 పై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దిశా నిర్దేశం చేశారు. సోమవారం శ్రీకాకుళం మండలంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో DEO చైతన్య, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ భోజనం పథకంపై వివరించాలని, విద్యార్థులుకు ఆటల పోటీలపై దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటాలన్నారు.
News July 8, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు సీత్లా పండుగ

బంజారాలు ఈ ఏడాదిలో జరుపుకునే మొదటి పండుగ సీత్లా. ముఖ్యంగా బంజారా తెగలో ప్రకృతిని, పశుసంపదను, పంటలను కాపాడే దేవతైన సీత్లా మాతను పూజిస్తారు. పండుగను ఏటా ఆషాఢమాసంలో జరుపుకుంటారు. భవానీ మాతకు మహిళలు నైవేద్యంగా పాయసం, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, గుగ్గిళ్లను సమర్పిస్తారు. మీ తండాల్లో ఈరోజు సీత్లా పండుగ జరుపుకుంటున్నారా?.. COMMENT చేయండి.
News July 8, 2025
NLG: వీరు మారరా.. లంచం లేనిదే పనిచేయరా..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవినీతికి పాల్పడుతూ కనీసం నెలకొకరు ఏసీబీకి <<16978616>>చిక్కుతున్నారు.<<>> కేసులు నమోదు చేస్తున్నా అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. గడిచిన రెండేళ్లలో 18 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. రూ.70 వేలు లంచం డిమాండ్ చేసి మిర్యాలగూడ సివిల్ సప్లయూస్ డీటీ జావేద్ సోమవారం ఏసీబీకి చిక్కారు. సూర్యాపేటలో మే 12న సీఐ, డీఎస్పీ లంచం డిమాండ్ చేయగా అధికారులు పట్టుకున్నారు.