News March 21, 2025
MHBD: ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలి: డిపో మేనేజర్

ఆర్టీసీ కార్గో అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ శివప్రసాద్ అన్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుండగా కళ్యాణానికి వెళ్లలేని భక్తుల కొరకు స్వామివారి కల్యాణ తలంబ్రాలు టీజీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేసుకుని పొందవచ్చని, డిపో మేనేజర్ శ్రీ ఎం శివ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.151 వెచ్చించి, బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
రాజమండ్రి: కలెక్టర్ ప్రకటన.. రేపు యథావిధిగా..

తూ.గో. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక), రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డివిజన్, మండల స్థాయిలలో కూడా మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆయా ప్రధాన కార్యాలయం నుంచి హాజరావుతారని వెల్లడించారు.
News February 22, 2026
ఈనెల 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపాలిటీ కార్యాలయాలలోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.
News February 22, 2026
BELలో మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులు

చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


