News April 23, 2025
MHBD: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ కాలేజీ విద్యార్థులు

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా మోడల్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో బి.సాయి సుష్మ 462/470(ఎంపీసీ), జె.మధుమిత 426/440(బైపీసీ), ఏ.శ్రీలక్ష్మి 447/500( సీఈసీ), కే.అనిల్ 839/1000(ఎంపీసీ), కె.మహేశ్వరి 952/1000(బైపీసీ), ఈ.సాయి దుర్గేశ్ 934/1000(సీఈసీ) ఉత్తమ ఫలితాలు సాధించారు.
Similar News
News April 23, 2025
ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.
News April 23, 2025
శ్రీరాంపూర్: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు

సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. అర్హత కలిగిన ఉద్యోగుల ఉన్నత చదువుకు ఇప్పటి వరకు యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహక నగదు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వివిధ పోటీ పరీక్షల్లో 2 వేలలోపు ర్యాంకు సాధించిన 57 మందికి అందిస్తున్న రూ.10 వేలు మెరిట్ స్కాలర్ షిప్‌ను రూ.16 వేలకు పెంచింది. అలాగే ర్యాంక్ పరిమితి 2 వేలు లోపు నుంచి 8 వేలకు అవకాశం కల్పించారు.
News April 23, 2025
పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం: ప్రకాశం ఎస్పీ

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్ఠ మరింత పెంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆయన మంగళవారం నియామకపత్రాలు అందజేశారు. పోలీస్ శాఖలో చేరడం గొప్ప అవకాశమన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం ముఖ్య కర్తవ్యమని సూచించారు.