News October 13, 2025

MHBD: ఈనెల 14 నుంచి 18 వరకు పలు రైళ్లు రద్దు

image

ఈనెల 14 నుంచి 18 వరకు గోల్కొండ, శాతవాహన, ఇంటర్ సిటీ, అప్ అండ్ డౌన్ పాసింజర్ రద్దు చేశారు. నెంబర్ 11020/11019 కోణార్క్ EXP 16, 17వ తేదీల్లో వయా గుంటూరు మీదుగా డైవర్ట్ చేశారు. 16న నెంబర్ 17205 షిరిడి EXP వయా నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా, 18న నెంబర్ 17206 షిరిడి EXP వయా గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ మీదుగా డైవర్ట్ చేశారు. రైల్వే ప్రయాణికులు గమనించగలరని రైల్వే అధికారులు తెలిపారు.

Similar News

News October 13, 2025

జొన్న సాగు.. మేలైన యాజమాన్య పద్ధతులు

image

తెలుగు రాష్ట్రాల్లో రబీలో జొన్నను OCT రెండో వారం వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 3KGల మోతాదు, మొక్కల మధ్య 15CM, వరుసల మధ్య 45CM దూరం ఉండేలా విత్తుకోవాలి. KG విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 70 WS+ 2గ్రా కార్బెండజిమ్‌తో శుద్ధి చేయాలి. విత్తిన తర్వాత 35 రోజులపాటు కలుపు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. అంతర పంటలుగా కంది 2:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. అపరాలను కూడా విత్తుకోవచ్చు.

News October 13, 2025

రూల్ ప్రకారం.. ఇంట్లో ఎంత బంగారం ఉండొచ్చు?

image

దేశంలో బంగారం కొనుగోళ్లను పర్యవేక్షించే ఆదాయ పన్ను శాఖ రైడ్స్ సమయంలో సరైన పత్రాలు చూపిస్తే ఎంత బంగారమైనా ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే పత్రాలు లేకున్నా పౌరుల వద్ద కొంతమొత్తంలో బంగారం ఉండేందుకు అనుమతి ఉంది. పెళ్లికాని మహిళలు: 250గ్రా, పెళ్లైన మహిళలు: 500గ్రా. పురుషులు: 100గ్రా. పసిడి కలిగి ఉండొచ్చు. వీటికి వారసత్వంగా, పెళ్లితో కానుకగా వచ్చిన గోల్డ్ అదనంగా ఉంటే అందుకు తగిన డాక్యుమెంట్స్ చూపాలి.

News October 13, 2025

వైకుంఠమే భువి చేరితే.. అదే తిరుమల కొండ

image

తిరుమలను కలియుగ వైకుంఠంగా పేర్కొంటారు. నిజానికి ఇది వైకుంఠంలో భాగమేనని చాలామందికి తెలియదు. ప్రళయ కాలంలో భూమిని పైకి తెచ్చిన విష్ణువు కొంతకాలం ఇక్కడే ఉండాలని సంకల్పించాడు. అప్పుడు శ్రీహరి నివాసానికై గరుత్మంతుడు వైకుంఠం నుంచి తెచ్చిన క్రీడాశైలమే ఈ వేంకటాచలం. దీన్ని సువర్ణముఖి నదికి ఉత్తరాన ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు లక్షలాది భక్తులు దర్శించుకునే తిరుమల కొండగా ప్రసిద్ధి చెందింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>