News January 23, 2025

MHBD: ఈనెల24 నుంచి ప్రారంభం కానున్న మిర్చి కొనుగోలు 

image

ఈనెల 24 నుంచి మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు చేస్తారని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. రైతులు ఎవరూ మధ్య దళారులను నమ్మి మిర్చిని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచించారు. రైతులు మిర్చిని మహబూబాబాద్ మార్కెట్‌కు తీసుకురావాలని కోరారు.

Similar News

News July 6, 2025

రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి

image

రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి చెందిన ఘటన <<16957129>>కట్టంగూరులో <<>>జరిగింది. శాలిగౌరారం(M)ఊట్కూరుకు చెందిన పిట్టల శంకరమ్మ, ఆమెకుమారుడు రజనీకాంత్‌ HYDలో నివాసం ఉంటున్నారు. నకిరేకల్‌(M) ఓగోడులో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి బైక్‌‌పై HYD బయలుదేరారు. KTNG బిల్లంకానిగూడెం సమీపంలో లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో రజనీకాంత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన శంకరమ్మ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.

News July 6, 2025

JGTL: పది నెలల ఉచిత శిక్షణ.. 2 రోజులే గడువు

image

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో UPSC ప్రిలిమ్స్ పరీక్ష కోసం 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణను ఇస్తున్నట్లు జగిత్యాల SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేష్ తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9959264770 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News July 6, 2025

HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

image

మొహరం నేపథ్యంలో బీబీ కా ఆలం ఊరేగింపులో భాగంగా నేడు HYDలోని సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అదేవిధంగా బీబీ కా ఆలం ఊరేగింపు చార్మినార్ ప్రధాన మార్గాల్లో కొనసాగనున్న నేపథ్యంలో చార్మినార్‌లోకి ప్రవేశం ఉండదన్నారు. సోమవారం తిరిగి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
-SHARE IT