News October 21, 2025
MHBD: ఉదయ్ నాగ్ అమరవీరుడై.. 17 ఏళ్లు!

MHBD జిల్లా మరిపెడ మండలానికి చెందిన గ్రేహౌండ్ పోలీస్ ఉదయ్ నాగ్ అమరవీరుడై 17 ఏళ్లు అయింది. అతి చిన్న వయసులో అతి కష్టమైన గ్రేహౌండ్స్ బలగాల్లో ఎంపికై మావోయిస్టులతో వీరోచిత పోరాటం చేశాడు. 2008 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో కూంబింగ్ ముగిసిన అనంతరం బలగాలు బలిమెల వద్ద బోటులో ప్రయాణం అవుతుండగా మావోలు గ్రానైట్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఉదయ్ నాగ్‌తో సహా 75 మంది పోలీసులు అమరులయ్యారు.
Similar News
News October 22, 2025
రబీ సాగు- నేలను బట్టి ఈ పంటలతో లాభాలు

రబీలో నేల స్వభావం, నీటి తడులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల రైతులు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్న ఎర్ర, నల్లరేగడి నేలల్లో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, అలసంద, కుసుమ, నువ్వులు సాగు చేయవచ్చు. వర్షాధార ఎర్ర నేలల్లో ఉలవలు, జొన్నలు.. వర్షాధార నల్ల రేగడి నేలల్లో శనగ, కుసుమ, ఆవాలు సాగు చేయవచ్చు.
News October 22, 2025
అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో వర్షాలు

అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో వర్షాలు పడతాయన్నారు. కనిష్ఠంగా 5.7 మి.మీ, గరిష్ఠంగా 17.3 మి.మీ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గాలిలో తేమ 60 – 85 శాతం ఉంటుందన్నారు.
News October 22, 2025
కడప జిల్లా కలెక్టర్‌కు సెలవులు మంజూరు.!

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈనెల 21 నుంచి 29 వరకు సెలవుపై వెళ్లనున్నారు. కాగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా JC అతిధిసింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ తిరిగి 29వ తేదీన విధుల్లో చేరనున్నారు.