News January 29, 2025

MHBD: ఏఆర్ కానిస్టేబుల్‌‌కు గోల్డ్ మెడల్

image

MHBD జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లింగన్న కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో 10 కి.మీ పరుగు పందెంలో గోల్డ్ మెడల్‌ సాధించారు. కేవలం 34 నిమిషాల్లోనే పరుగును పూర్తి చేసి పతకాన్ని సాధించారు. కానిస్టేబుల్ లింగన్నను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు.

Similar News

News February 20, 2026

జంగారెడ్డిగూడెం: మహిళ కడుపులో 8 కిలోల కణితి తొలగింపు

image

జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స గురువారం జరిగింది. బుట్టాయిగూడెం మండలానికి చెందిన ఓ మహిళ కడుపులో 8 కిలోల కణితి ఉన్నట్లు వైద్యుడు సంకు మురళి గుర్తించారు. ల్యాపరో స్కోప్ ద్వారా ఆపరేషన్ నిర్వహించి కణితి తొలగించామన్నారు. కడుపు నొప్పితో సదరు మహిళా ఆసుపత్రికి వచ్చిందని, ఆపరేషన్ అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

News February 20, 2026

‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానెల్ కూడా బ్లాక్ అవుతుందా?

image

ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్‌ను మెటా <<19187218>>బ్లాక్<<>> చేయడంతో అతడిపై ఫిర్యాదు చేసిన BJP నేత కరాటే కళ్యాణి స్పందించారు. అన్వేష్ యూట్యూబ్ ఛానెల్ సహా అన్నీ అకౌంట్లను డిలీట్ చేయించాలని CP సజ్జనార్‌ను కలవబోతున్నామని చెప్పారు. అలాగే పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరతామన్నారు. హిందువులను అన్వేష్ అవమానించారని, అతడికి జైలుశిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.

News February 20, 2026

చీర కట్టుకుంటున్నారా..? ఇలా చేస్తే సూపర్ లుక్

image

రోజూ ఎంత ట్రెండీ, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకున్నా ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చీరకే ఓటేస్తారు. అయితే చీర కట్టడంలో కొన్ని టిప్స్ పాటిస్తే లుక్ అదిరిపోతుందంటున్నారు నిపుణులు. ముందుగా చీర రంగు మీ ఒంటికి నప్పేదే ఎంచుకోవాలి. లైట్ కలర్ చీరైతే మంచి ప్రింట్స్ ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా ఫిట్ అయ్యే బ్లౌజ్ వేసుకోవాలి. అప్పుడప్పుడూ డిఫరెంట్‌గా కట్టడం కూడా ట్రై చేయాలి. చీరను బట్టి జ్యువెలరీ ఎంచుకోవాలి.