News August 13, 2025

MHBD కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. దీంతో జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 7995074803ను సంప్రదించాలని జిల్లా ప్రజలకు సూచించారు.

Similar News

News August 13, 2025

గిరిజన మహిళపై ఎస్సై లైంగిక వేధింపులు.. వీఆర్‌కు ఎస్పీ ఆదేశం

image

గిరిజన మహిళపై లైంగిక వేధింపుల కేసులో ముదిగుబ్బ(M) పట్నం SI రాజశేఖర్‌‌ను SP రత్న VRకు పంపారు. గరుగుతండాకు చెందిన మహిళ ఓ కేసు విషయంలో SIని సంప్రదించింది. తన కోరక తీరిస్తే న్యాయం చేస్తానని, లేకుంటే ఇబ్బంది పడతావంటూ ఆమెను SI బెదించాడు. రాత్రి సమయంలో వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయం SPకి చేరడంతో చర్యలకు పూనుకున్నారు. విచారణలో నిజమని తేలితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని తెలిపారు.

News August 13, 2025

భారీ వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన బాపట్ల కలెక్టర్

image

బాపట్ల జిల్లాకు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. మంగళవారం రాత్రి భారీ వర్షాలపై ఆర్డీవోలతో ఆయన సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో రూపొందించిన ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ఆదేశించారు.

News August 13, 2025

గతంలో ఇబ్బందులు మరొకసారి పునరావృతం కావొద్దు: సీఎం

image

గత సం. ఖమ్మంలో ఎదురైన ఇబ్బందులు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఖమ్మం కార్పొరేషన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి 24×7 మానిటరింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. సిబ్బంది సెలవులు రద్దు చేయాలని, ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని చెప్పారు. అటు విద్యా సంస్థలతో చర్చించి సంబంధిత శాఖ అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.