News January 31, 2025

MHBD: కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగదు చోరీ

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం శివారు బేగావతు తండాలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వీరన్న ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ.9 లక్షల నగదు దోచుకుపోయారని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సీహెచ్ నగేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News March 1, 2026

యాదాద్రిలో నేటి నుంచి నిత్య ఆర్జిత సేవలు పునఃప్రారంభంలు

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో, నేటి నుంచి నిత్య ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. 11రోజుల వేడుకల అనంతరం నిత్య సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, జోడు సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఉత్సవాల కారణంగా నిలిపివేసిన ఈ సేవలను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. బ్రహ్మోత్సవాల ముగింపుతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

News March 1, 2026

అన్నమయ్య: ప్రేమ పెళ్లి.. PSలో కౌన్సిలింగ్

image

అన్నమయ్య జిల్లా రామసముద్రం (M) దొడ్డిపల్లికి చెందిన సంతోశ్, భవాని అనే ప్రేమ జంట వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్దలు, గ్రామస్థుల సమక్షంలో చర్చించి వివాహం చేసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం జంటను అబ్బాయి తరఫు బంధువులకు అప్పగించారు.

News March 1, 2026

సత్యసాయి: ఆమెది హత్యా? ఆత్మహత్యా?

image

పుట్టపర్తిలోని పెడపల్లిలో వివాహిత చంద్రకళ (22) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతి అనుమానస్పదంగా మారింది. అదనపు కట్నం కోసం భర్తే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పుట్టపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు వర్షిత, మోక్షిత ఇరువురు పిల్లలు ఉన్నారు.