News March 14, 2025
MHBD: కొడుకుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ

మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాకు చెందిన భూక్యా శ్రీలతకు ఆమె భర్త మోతిలాల్‌కు మార్చి 4వ తేదీన వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి ఇంటి నుంచి తన కొడుకు వినయ్‌ని తీసుకొని శ్రీలత బయటకు వెళ్ళిపోయింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లు, ఇతర చోట్ల వెతికారు. కాని ఆచూకీ లేకపోవడంతో తల్లి ఇస్లావత్ కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కురవి SI సతీష్ తెలిపారు.
Similar News
News March 17, 2025
రాజేంద్రనగర్ NIRDPRలో రూ. లక్ష జీతంతో ఉద్యోగం

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు. వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్‌రు రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు మార్చి 19 చివరి తేదీ.
SHARE IT
News March 17, 2025
ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లోనే రూ.24 కోట్లు

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.
News March 17, 2025
అన్ని జిల్లాల పర్యటనకు కేటీఆర్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.