News December 13, 2025

MHBD: గ్రామ పంచాయతీ ఎన్నికల సమగ్ర సమాచారం!

image

బయ్యారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, గార్ల, నరసింహులపేట, పెద్ద వంగర, తొర్రూరు మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 158 సర్పంచ్ స్థానాలకు గాను.. ఇప్పటికే 15 ఏకగ్రీవం అయ్యాయి. 143 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1360 వార్డు మెంబర్ స్థానాలకు గాను.. 255 ఏకగ్రీవం అయ్యాయి. 1105 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News December 15, 2025

ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: ASF SP

image

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP నితికా పంత్ తెలిపారు. ఈ నెల 17న జరిగే ఎన్నికలకు 795 మంది పోలీస్, ఇతర శాఖల సిబ్బందిని నియమించామన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు 163 BNSS అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో గుంపులు, ర్యాలీలు నిషేధమన్నారు.

News December 15, 2025

‘1378 పాఠశాలల్లో నైపుణ్య విద్య’

image

ఆంధ్రప్రదేశ్‌లోని 1378 పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం నైపుణ్య విద్యను అమలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. సోమవారం పార్లమెంటులో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా సమగ్ర శిక్ష పథకం ద్వారా దశలవారీగా అన్ని పాఠశాలల్లో దీనిని విస్తరిస్తామని పేర్కొన్నారు.

News December 15, 2025

కాకినాడ: పల్స్‌ పోలియో విజయవంతానికి సన్నద్ధం

image

21న నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమంపై కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరసింహనాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లకు అవగాహన కల్పించారు. విశాఖ ఎస్ఎంఓ డాక్టర్ జాషువా పాల్గొని శిక్షణ ఇచ్చారు. 1,594 బూత్‌ల ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.