News October 17, 2025
MHBD: ఘనంగా అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

MHBD(D) దంతాలపల్లి(M) బీరిశెట్టిగూడేనికి చెందిన నాగలక్ష్మి-మురళీ దంపతుల కుమార్తెలు అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను స్టేట్ హోమ్(HYD)లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు అన్నారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరారు.
Similar News
News October 17, 2025
చెప్పింది వినకపోతే హమాస్‌ని చంపేస్తాం: ట్రంప్

హమాస్‌కు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘గాజాలో ప్రజల ప్రాణాలు తీయడం ఆపాలి. అది డీల్‌లో లేదు. అలా ఆపని పక్షంలో హమాస్‌ని చంపడం తప్పితే మాకు మరో దార్లేదు’ అని తెలిపారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చించేందుకు వచ్చేవారం మరోసారి ఆయనతో భేటీకానున్నట్లు చెప్పారు. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీని కలవనున్నట్లు తెలిపారు.
News October 17, 2025
అక్టోబర్ 17: చరిత్రలో ఈ రోజు

1948: నటి అన్నపూర్ణ జననం
1965: పాప్ సింగర్ మాల్గుడి శుభ జననం
1970: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే జననం
1992: హీరోయిన్ కీర్తి సురేష్(ఫొటోలో) జననం
1992; హీరోయిన్ ప్రణీత సుభాష్(ఫొటోలో) జననం
*అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం
News October 17, 2025
ఆ ఆసుపత్రుల్లో ఆశించిన పురోగతి లేదు: ఖమ్మం కలెక్టర్

మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. వైద్య విధానం పరిషత్ ఆసుపత్రులలో ప్రసవాలు జులైలో 47 నుంచి సెప్టెంబర్ 74కు చేరాయని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రిలో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆసుపత్రులలో ఆశించిన పురోగతి లేదన్నారు.