News September 10, 2025
MHBD: చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన ఎంపీ

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌తో పాటు MHBD ఎంపీ బలరాం నాయక్ బుధవారం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పీడిత ప్రజల విముక్తి కోసం అహర్నిశలు కృషిచేసిన వీరనారి ఐలమ్మ అని వారు కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రజా పాలనతో అహర్నిశలు పాటు పడతామన్నారు.
Similar News
News September 11, 2025
VZM: నేడు రాష్ట్రానికి చేరుకోనున్న యాత్రికులు

నేపాల్‌లో గడిచిన 2 రోజులగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా నుంచి మొత్తం 61 మంది మానససరోవర యాత్రకు వెళ్లిన వారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఖాట్మండు నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్రికులందరూ రాష్ట్రానికి చేరుకుంటారన్నారు. వారి బంధువులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు.
News September 11, 2025
వనపర్తి: ఇంటర్ ప్రవేశాలు.. ఈనెల 12 వరకు ఛాన్స్

వనపర్తి జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 12 వరకు అవకాశం కల్పించినట్లు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా, ప్రైవేట్ కళాశాలల్లో రూ. 500 అపరాధ రుసుముతో ప్రవేశాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందకుండా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News September 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.