News November 4, 2025

MHBD: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 3 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ రాజు అనే వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. 3 రోజుల క్రితం బతికి ఉన్న రాజును వైద్య సిబ్బంది మార్చురీలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా రాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే రాజు మృతి చెందాడని ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News November 4, 2025

యువజన ఉత్సవాలు ప్రారంభించిన కలెక్టర్

image

జనగామ జిల్లా యువజన ఉత్సవాలను మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత సాంస్కృతిక కళారంగాల్లోని అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.

News November 4, 2025

గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

image

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు చాలామంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉన్న గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్తసరఫరా జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టి ఈ స్ట్రోక్‌ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% దాకా క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రో‌క్‌లేనని తెలిపారు.

News November 4, 2025

ఫైనల్‌కు ముందు కౌర్ బామ్మకు హార్ట్ఎటాక్.. విషయం దాచి!

image

ఉమెన్స్ WC ఫైనల్‌కు ముందు IND ప్లేయర్ అమన్‌జోత్ కౌర్ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఆమె కుటుంబం కఠిన నిర్ణయం తీసుకుంది. బామ్మకు హార్ట్ఎటాక్ వచ్చిన విషయాన్ని మ్యాచ్ ముగిసేవరకు కౌర్‌కు తెలియకుండా దాచింది. విజయం తర్వాత విషయం తెలుసుకుని ఆమె బాధతో కుంగిపోయారు. కాన్సంట్రేషన్ దెబ్బతినొద్దని ఆమెకు ఈ విషయాన్ని చెప్పలేదని కుటుంబం తెలిపింది. కూతురి కోసం గుండెనిబ్బరం చూపిన కుటుంబంపై ప్రశంసలొస్తున్నాయి.