News October 14, 2025
MHBD: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: రజిత

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఉపాధి అధికారి రజిత అన్నారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మహబూబాబాద్‌లోని శ్రీనివాస నర్సరీ, మారుతీ ఆగ్రోటేక్ ఖాళీగానున్న ఫీల్డ్ అడ్వైజరీ, గ్రూప్ లీడర్స్ పోస్టుల భర్తీకి ఈనెల 15న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అభ్యర్ధులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 18-35 వయసు కలిగిన వారు అర్హులని తెలిపారు.
Similar News
News October 14, 2025
తిరుపతి: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో శిక్షణ

APSSDC ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(NAC) తిరుపతిలో అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర వెల్లడించారు. పదో తరగతి పాసై, 15 నుంచి 45 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఎస్వీ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న NAC కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 20.
News October 14, 2025
ఎల్లో అలర్ట్: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కాసేపట్లో HYD, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 14, 2025
ఫిట్‌నెస్, ఫామ్ ఉంటేనే WC జట్టులో RO-KO: రవిశాస్త్రి

2027 WCలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అది వారి హంగర్, ఫిట్‌నెస్, ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. AUSతో వన్డే సిరీస్ పూర్తయ్యేలోగా జట్టులో కొనసాగాలో వద్దో వారిద్దరికీ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే గిల్, జైస్వాల్, తిలక్ లాంటి యంగ్ ప్లేయర్లు చాలా మంది సత్తా చాటుతున్నారు. కాబట్టి రోహిత్, కోహ్లీ రాణించాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.