News March 11, 2025

MHBD: జాబ్ మేళా సద్వినియోగపర్చుకోండి: రజిత

image

MHBD జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 12న వైఎస్‌కే ఇన్ఫోటెక్ రంగారెడ్డి, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి టి రజిత ఒక ప్రకటనలో తెలిపారు. 18-28 ఏళ్లు నిండి ఉండి పదవ తరగతి విద్యార్హతతో ఆసక్తి కలిగిన స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని రజిత పేర్కొన్నారు. 

Similar News

News February 20, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in

News February 20, 2026

ఈ మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వద్దు

image

మన ఇళ్లు, పొలాల గట్ల దగ్గర పెంచుకోదగ్గ మొక్కల్లో అరటి, బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మునగ, అవిసె, పందిరి చిక్కుడు, బచ్చలి, గుమ్మడి, కరివేపాకు, కుంకుడు మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ మొక్కలను ఒకసారి నాటితే ఎక్కువకాలం ఫలాలనిస్తాయి. వీటి పెంపకానికి పెద్దగా ఖర్చు కానీ, యాజమాన్యం కానీ అవసరం ఉండదు. ఇవి తక్కువ విస్తీర్ణంలో పెరుగుతూ ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్నిస్తూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

News February 20, 2026

రేపు వినుకొండలో సీఎం షెడ్యూల్ ఇదే

image

CM చంద్రబాబు ఈనెల 21న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌లో వివాహ వేడుకలకు హాజరై, మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా వినుకొండ చేరుకుంటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజల నుంచి స్వాగతం స్వీకరిస్తారు. అనంతరం ప్రజా వేదికలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పార్టీ కేడర్ సమావేశం, సీహెచ్‌సీ కార్యక్రమాల అనంతరం సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.