News January 14, 2026

MHBD జిల్లాలో నూతన సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు

image

నూతన సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆరు విడతలగా శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఇందులో PR చట్టం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగం, GPలో నిర్వహించాల్సిన బాధ్యతలను వివరిస్తారు. వీరికి DLPOలు టీచర్ ఆఫ్ ట్రైనేర్స్(TOT)గా వ్యవహరిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో 482 మంది నూతన సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.

Similar News

News February 5, 2026

నేడు అమరావతికి రానున్న చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే!

image

అమరావతి ప్రాంతంలో CM చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వెలగపూడి సచివాలయానికి, అనంతరం 2.50 గంటలకు రాయపూడి పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని సాగునీటి సంఘాల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.50 గంటలకు నివాసానికి చేరుకొని, 6.10 గంటలకు కార్మిక శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు పర్యటన వివరాలను విడుదల చేశారు.

News February 5, 2026

NLG: తగ్గుతున్న పంటల సాగు.. వరిదీ అదే పరిస్థితి

image

మారిన వాతావరణ పరిస్థితులు.. సాగు ఖర్చులు పెరగడం.. దిగుబడులు తగ్గడం గిట్టుబాటు ధరలు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతుంది. ఈ యాసంగిలో జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని పేర్కొన్నప్పటికీ.. ఈ సీజన్ ముగిసేనాటికి 4.36 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయింది.

News February 5, 2026

భారీ జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

image

సుప్రీంకోర్టులో 90 లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, ఇంటిగ్రేటెడ్ లా అర్హతతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయినవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.100000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.sci.gov.in/