News January 12, 2026
MHBD జిల్లాలో యూరియా కొరత లేదు: ADA

జిల్లా వ్యాప్తంగా 571 యూరియా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సరిత తెలిపారు. PACS ఆధ్వర్యంలో 439, ప్రైవేట్ డీలర్స్, అదనపు సహకార శాఖ కేంద్రాలు 20, రైతు సేవ ఆగ్రోస్, ODCMC, మొదలగు కేంద్రాలు 112 ద్వారా యూరియా పంపిణీ పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 2లక్షల 89 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం కాగా, ఇప్పటికే 2లక్షల 25 వేల టన్నులు సేకరించామన్నారు.
Similar News
News February 17, 2026
కుక్కలా నడుస్తుంది.. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది..

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో రోబో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. TCS అభివృద్ధి చేసిన ఈ రోబో కుక్కలా నడుస్తుంది. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది. రిస్కీ ప్రాంతాల్లో ప్రమాదాలు, తప్పిదాలను నివారించడమే ఈ ఆవిష్కరణ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. కంప్రెసర్లు, ఎలక్ట్రికల్ ప్యానల్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సమస్యలను, గ్యాస్ లీకేజ్, వెల్డింగ్ లోపాలనూ గుర్తించగలదు. కష్టతరమైన జోన్లలోనూ పని చేస్తుందట.
News February 17, 2026
శుక్ర మౌఢ్యమి ముగుస్తోంది కానీ!

ఈరోజుతో శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలు మొదలవనున్నాయి. అయితే ఈ మంచి రోజులు మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అలాగే మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉంది. ఈ సమయంలోనూ శుభకార్యాలు చేయరు. దీంతో మే నెలలో గృహారంభం, గృహప్రవేశం వంటి పనులు చేయరాదు. కాబట్టి ఈ లోపు మీ పనులు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.
News February 17, 2026
కర్నూలు: అడవిలో మహిళ హత్య.. సంచలన తీర్పు!

గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన దేవదాసుకు బైలుప్పలకు చెందిన లక్ష్మిని హత్య చేసిన కేసులో సోమవారం జీవిత ఖైదు పడింది. 2021లో మహిళ కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముద్దాయిని అరెస్ట్ చేసి విచారించారు. కసాపురం సమీప అటవీ ప్రాంతంలో హత్యచేసి శవాన్ని కాల్చినట్లు వెల్లడైంది. కేసును విచారించిన ఆదోని 2వ అదనపు జిల్లా జడ్జి నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించారు.


