News October 18, 2025

MHBD జిల్లాలో లిక్కర్ షాపులకు 937 దరఖాస్తులు

image

మహబూబాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 61 లిక్కర్ షాపులకు గాను 937 దరఖాస్తులు వచ్చాయని MHBD ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు.
MHBD 327, తొర్రూర్ 445, గూడూరు 165 కాగా.. మొత్తం 937 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 18తో గడువు ముగిస్తుందన్నారు.

Similar News

News October 18, 2025

గొల్లపూడి ఘాట్ వద్ద విపత్తులపై మాక్ డ్రిల్

image

విపత్తుల సమయంలో ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించినట్లు విజయవాడ ఆర్డీఓ చైతన్య తెలిపారు. గొల్లపూడి ఘాట్ వద్ద రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్) నేతృత్వంలో ఈ మాక్ ఎక్సర్‌సైజ్ జరిగింది. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్, వైద్య, పశుసంవర్ధక, మహిళా శిశు సంక్షేమ శాఖల సిబ్బంది ఇందులో పాల్గొని, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు.

News October 18, 2025

కడప: దీపావళి పండగకు 33 ప్రత్యేక బస్సులు

image

దీపావళి పండగ సందర్భంగా కడప జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 33 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. బెంగళూరు – చెన్నై, హైదరాబాదు – విజయవాడకు నడుస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News October 18, 2025

పండగకు ఊరెళ్తున్నారా? జర జాగ్రత్త: SP

image

దీపావళి పండుగ వేల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్తున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో దొంగలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు తమ వస్తువులు, డబ్బు, నగలను పట్ల కనిపెట్టుకుని ఉండాలన్నారు. ఒక వేళ మీ వస్తువులు దొంగిలించబడిన వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని SP కోరారు.