News March 4, 2025

MHBD జిల్లా కేంద్రంలో రేపు ఎంపీ బలరాం

image

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ మంగళవారం జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంటారని ఆయన PRO ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే మూడవ లైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి నేరుగా MPని సంప్రదించవచ్చని కార్యాలయ వర్గాలు ప్రకటించారు.

Similar News

News March 4, 2025

NZB: వర్క్‌ఫ్రం హోమ్.. రూ. 90,300 మోసపోయిన యువతి

image

వర్క్‌ఫ్రం హోమ్ పేరుతో ఓ యువతి మోసపోయినట్లు నిజామాబాద్ 1టౌన్ SHO రఘుపతి తెలిపారు. రామ్ గోపాల్ స్ట్రీట్‌కు చెందిన యువతి ఫేస్‌బుక్‌లో రిల్స్ చూస్తుండగా వర్క్ ఫ్రం హోమ్ అనే యాడ్ చూసి ఆకర్షితులై ఓ నంబరుకు వాట్సాప్ ద్వారా లింక్ పంపింది. తన  బ్యాంక్ వివరాలను పంపి, రిజిస్ట్రేషన్ ఫీ 90,300 ఫోన్ పే ద్వారా చెల్లించింది. దీంతో మోసపోయానని భావించి వన్ టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News March 4, 2025

అత్యంత పేదరిక జిల్లాల్లో ప్రకాశం జిల్లాకు 4వ స్థానం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్‌కౌంట్ రేషియో 6.28%గా ఉండగా.. తీవ్రత విషయంలో 43.60%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.027గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ప.గో జిల్లా మొదట ఉంది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూ.గో, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

News March 4, 2025

నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు విజయం

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడుది విజయనగరంలోని బాబామెట్ట. 1996లో చాకలిపేట పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరారు. పదేళ్ల సర్వీసు అనంతరం 2006లో జాబ్‌కు రిజైన్ చేశారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన అనంతరం టీచర్ ఎమ్మెల్సీగా గెలిచారు. 2013లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఓడిపోయిన ఆయన.. తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు.

error: Content is protected !!