News February 17, 2026
MHBD: ‘టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి’

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశిరాం అన్నారు. MHBD పట్టణంలోని నాయకుల ఆశ్రయం పాఠశాలలో నిర్వహించిన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్, వెల్ఫేర్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ATDO భాస్కర్, ఉపేందర్ తదితరులున్నారు.
Similar News
News February 21, 2026
‘వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పశు వైద్య శిబిరాల ఏర్పాటు’

వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయన్నారు. ప్రతి మార్కెట్ కమిటీ పరిధిలో రెండు పశువైద్య శిబిరాలను నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31నాటికి పశువైద్య శిబిరాల ఏర్పాటు పూర్తి కావాలని ఆమె స్పష్టం చేశారు.
News February 21, 2026
ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ పనులు చేపట్టాలి: కలెక్టర్

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయ్‌తో కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రోడ్డు పనుల విషయంలో భూసేకరణ చేపట్టాలన్నారు.
News February 21, 2026
GWL: భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

GWL జిల్లాలో పెండింగ్ ఉన్న భూభారతి దరఖాస్తులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. IDOC కార్యాలయంలో తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రస్తుతం RDO స్థాయిలో 1370 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా క్లియర్ చేయాలని సూచించారు. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కళ్యాణలక్ష్మి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.


