News February 26, 2026
MHBD: ఢిల్లీ వేదికగా తాళ్లపూసపల్లి రైతుకు అవార్డు

కేసముద్రం మండలం తాళ్లపూస పల్లికి చెందిన రైతు జైపాల్ రెడ్డి జాతీయ వ్యవసాయ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ఫెల్లో ఫార్మర్ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, అగ్రికల్చర్ సెక్రటరీ చతుర్వేది, IARI శ్రీనివాస్ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందజేశారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు చైతన్య అవగాహన సదస్సుల నిర్వహించడం పట్ల జైపాల్ రెడ్డి ఈ గౌరవం పొందారు.
Similar News
News March 6, 2026
కామారెడ్డి: కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి

కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు వినతిపత్రం అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో సొంత పార్టీ కార్యాలయం లేకపోవడంతో కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వెంటనే స్థలం కేటాయించి సహకరించాలని వారు కలెక్టర్‌ను కోరారు.
News March 6, 2026
రేపు సీతంపేట ఐటీడీఏలో జిల్లా కలెక్టర్ పర్యటన

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి శనివారం సీతంపేట ఐటీడీఏలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ గార్డెన్, ఇప్పకూడ గ్రామంలో ముస్తాబు కార్యక్రమం, జగతపల్లి వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్‌ను కలెక్టర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఐటీడీఏ సిబ్బంది పేర్కొన్నారు.
News March 6, 2026
22ఏ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించండి: కలెక్టర్

జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో 229 విజ్ఞప్తులు వచ్చాయని వాటిలో 18 మాత్రమే పరిష్కరించడం జరిగిందని,10 కేసులు రిజెక్ట్ అయ్యాయన్నారు. 2249 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయవలసి ఉండగా, 2184 పంపిణీ చేశారన్నారు.


