News April 19, 2025

MHBD: దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 ఏడాదికి కార్పొరేట్ కళాశాలల ప్రవేశ పథకంలో భాగంగా ఉత్తమ కళాశాలలను ఎంపిక చేయడానికి జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి నరసింహస్వామి తెలిపారు. కళాశాలల దరఖాస్తులను epass.telangana.gov.inలో ఈ నెల 30 లోపు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News December 22, 2025

తిరుపతి: యాక్సిడెంట్లకు ఇదే కారణం.!

image

యాక్సిడెంట్లకు బ్లాక్‌స్పాట్స్ ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఇవి జిల్లాలో దాదాపు 48 ఉండగా, సర్వీస్ రోడ్ల నుంచి హైవేలోకి వెళ్లేటప్పుడు స్పీడ్, మలుపుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. TPT–CTR, పీలేరు–TPT, చంద్రగిరి–చెన్నై, కడప–రేణిగుంట హైవేలపై ప్రమాదాలు ఎక్కువ. భాకరాపేట ఘాట్, ఐతేపల్లి వద్ద ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. సోలార్ బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లతో సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు

News December 22, 2025

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

image

హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 40 మంది యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యూనివర్సిటీ సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రుల్లో తరలించారు. ఆహారం కలుషితం కావడంతో(డీ హైడ్రేషన్) వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 22, 2025

పర్యాటక ప్రాంతాల వివరాలు పంపండి: ఖమ్మం కలెక్టర్

image

అన్ సీన్ పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. నేచర్, వైల్డ్ లైఫ్, హెరిటేజ్, వాటర్ బాడీస్, స్పిరిచువల్, అడ్వెంచర్, ఆర్ట్ అండ్ కల్చర్ వంటి విభాగాల్లోని ప్రదేశాల వివరాలను జనవరి 5లోపు పంపాలని సూచించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.