News September 11, 2025
MHBD: దోమల నివారణకు ఫాగింగ్ జాడెక్కడ..?

జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం పట్టణాల్లో దోమల నివారణ చర్యలు లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఏటా దోమల నివారణకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఆచరణలో ఫాగింగ్ కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News September 11, 2025
నేడు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనం అటవీ పార్కులో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఆర్థికసాయం అందజేస్తారు.
News September 11, 2025
సిద్దిపేట: ‘అడ్మిషన్లకు 12 చివరి తేదీ’

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకునేందుకు ఈనెల 12 చివరి తేదీ అని సిద్దిపేట రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కోసం అర్హత కలిగిన అభ్యర్థులు https://braou.ac.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News September 11, 2025
నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీ బలం: మర్రి జనార్దన్ రెడ్డి

అమ్రాబాద్ మండల కేంద్రంలో అమ్రాబాద్, పదర మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.