News October 9, 2025

MHBD: నేటి నుంచి ఎన్నికల నామినేషన్లు

image

మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నరసింహాలపేట, పెద్ద వంగర, తొర్రూరు, మండలాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి అధికారులు MPDO కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.

Similar News

News October 9, 2025

గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ తేదీని చెక్ చేయండిలా!

image

ఇంట్లో నెలల తరబడి గ్యాస్ సిలిండర్ ఉంచుతున్నారా? ఇది ప్రమాదమే. ఎందుకంటే వాటికీ ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. సురక్షితమైన వాడకం కోసం దీనిని నిర్ణయించారు. దీనిని సిలిండర్ పైభాగంలో ముద్రిస్తారు. ఉదా.. ‘C-27’ అని ఉంటే 2027లో JUL- SEP మధ్య ముగుస్తుందని అర్థం. A అని ఉంటే JAN TO MAR, B- APR TO JUN, C-JULY TO SEP, D- OCT TO DEC అని తెలుసుకోవాలి. గడువైపోయిన వాటిని వాడకుండా ఉంటే ప్రమాదాలు జరగవు. SHARE IT

News October 9, 2025

గ్రూప్1 నియామకాలపై జోక్యానికి సుప్రీం నో

image

తెలంగాణలో గ్రూప్1 నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఇదే అంశంపై ఈనెల 15న హైకోర్టులో విచారణ ఉన్న సమయంలో తాము ఇందులో జోక్యం చేసుకోబోమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. కాగా హైకోర్టు తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యర్థులను సెలక్ట్ చేసింది.

News October 9, 2025

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం అక్కడే!

image

గడచిన 24 గంటల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా కోడేరు మండలంలో 32.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్‌లో 21.2 మి.మీ., కల్వకుర్తిలో 14.0 మి.మీ., తిమ్మాజీపేటలో 12.3 మి.మీ., బల్మూరులో 11.3 మి.మీ., పెద్దకొత్తపల్లిలో 11.0 మి.మీ., తాడూరులో 6.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.