News October 19, 2025

MHBD: పెళ్లికి నిరాకరణ.. ప్రియుడి ఆత్మహత్య

image

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. SI కరుణాకర్ తెలిపిన వివరాలు.. ఇనుగుర్తికి చెందిన ఆలకుంట్ల రాజు(27) వరంగల్‌కు చెందిన ఓ అమ్మాయి 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన రాజు ఈ నెల 15న పురుగుమందు తాగాడు. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

Similar News

News October 19, 2025

గాజాపై దాడికి హమాస్ ప్లాన్!.. హెచ్చరించిన US

image

గాజాలోని పౌరులపై దాడి చేయాలని హమాస్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందని US విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. మీడియేషన్ ద్వారా సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ హమాస్ దాడి చేస్తే ప్రజలను, సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

News October 19, 2025

వనపర్తి: జనుంపల్లి వంశస్థుల రాజ ప్రసాదం

image

నాడు రాజుల పాలనలో ఉన్న నిర్మాణాలు నేడు చరిత్రకు సాక్షాలుగా నిలుస్తున్నాయి. నిజాం కాలంలో సామంత రాజులుగా కొనసాగిన జనుంపల్లి వంశస్థులు మొదట్లో సుగూరు, తర్వాత వనపర్తి ప్రాంతాన్ని సంస్థానం కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. దేశానికి స్వతంత్రం వచ్చే వరకు వీరి పాలన కొనసాగింది.1885లో పట్టణం నడిబొడ్డులో “రామ్ సాగర్ బంగ్లా” నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఈ బంగ్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నడుస్తోంది.

News October 19, 2025

యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు: SI

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసి, మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై కారంచేడు SI ఖాదర్ బాషా శనివారం కేసు నమోదు చేశారు. SI వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన ఓ యువతిని వరసకు బావ అయ్యే యువకుడు వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడు. యువకుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసి యువకుడి తల్లిదండ్రులను ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.