News October 30, 2025
MHBD: పోలీస్ సేవలు భేష్.. అభినందించిన డీజీపీ

భారీ వర్షం నేపథ్యంలో మహబూబాబాద్‌లో నిలిచిన భారీ వరదకు రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తన పోలీస్ సిబ్బంది తో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు వాటర్ బాటిల్స్, ఫుడ్, బిస్కెట్స్‌ను అందించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈదృశ్యాలను చూసిన డీజీపీ మహేందర్ రెడ్డి.. ఎస్పీ, పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ Xలో పోస్ట్ చేశారు.
Similar News
News October 30, 2025
ప్రొద్దుటూరు: కుమారుని వివాహానికి వెళ్తూ తండ్రి మృతి

నెల్లూరు జిల్లాలో కుమారుని వివాహానికి వెళ్తూ ప్రొద్దుటూరుకు చెందిన బాషా సయ్యద్ పాల్ (50) మృతి చెందారు. బుధవారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన మృతి చెందారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. UPకి చెందిన సయ్యద్ పాల్ ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఆయనతో పాటు సమీప బంధువు సయ్యద్ ఆసిఫ్(20) కూడా మృతి చెందాడు.
News October 30, 2025
హంటర్ రోడ్: విద్యార్థినులను బయటకు తీసుకొచ్చిన పోలీసులు

హంటర్ రోడ్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో విద్యార్థినులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని పరిశీలించడానికి కలెక్టర్ డాక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా హంటర్ రోడ్ ప్రాంతాన్ని సందర్శించారు. వరద నీరు పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు సూచించారు. సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.
News October 30, 2025
రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా?

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాలతో అనారోగ్యాలు వస్తాయంటున్నారు నిపుణులు. చాలా లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.


