News March 13, 2025

MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

image

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Similar News

News March 13, 2025

HYD: BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.

బీఆర్ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: సీతక్క

image

తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను నువ్వు అని సంబోధించడం వారి అహంకారానికి నిదర్శనం అన్నారు. స్పీకర్ దళితుడు కాబట్టే అగౌరవ పరుస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ అంటే గౌరవం లేదని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

error: Content is protected !!