News March 13, 2025

MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

image

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Similar News

News March 13, 2025

నటి ఇళ్లలో ED దాడులు: బంగారం సీజ్!

image

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో భాగంగా బెంగళూరులోని 8 లొకేషన్లలో ED దాడులు చేపట్టింది. కోరమంగల సహా నటి రన్యారావుకు చెందిన 2 ఇళ్లు, కేసులో సహ నిందితుడు తరుణ్ ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు భారీ స్థాయిలో బంగారం సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో తన కుమార్తెకు సాయం చేయాలని ఆమె తండ్రి, DGP రామచంద్రారావు కానిస్టేబుల్ బసవరాజును ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.

News March 13, 2025

మా వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: సీఎం

image

AP: ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘నేను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు 10-15 గంటలే కరెంటు ఉండేది. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. 2003లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం. మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇవ్వగలిగింది’ అని అసెంబ్లీలో సీఎం చెప్పారు.

News March 13, 2025

రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

image

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం మోయినాబాద్లో 39.7℃, మొగల్గిద్ద, కేతిరెడ్డిపల్లె, మంగళపల్లె 39.5, ప్రొద్దుటూరు 39.3, రెడ్డిపల్లె 39.2, షాబాద్, కాసులాబాద్ 39.1, చుక్కాపూర్ 39, మహేశ్వరం, నాగోల్ 38.6, హస్తినాపురం 38.5, మామిడిపల్లె, తుర్కయంజాల్, తొమ్మిదిరేకుల 38.5, కోతూర్, హఫీజ్‌పేట్ 38.4, చంపాపేట్ 38.3, శంకర్‌పల్లి 38.3, ఖాజాగూడ, మహంకాళ్, అలకాపురి 38.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!