News March 1, 2025

MHBD: ప్రైవేట్ కళాశాలల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: PDSU

image

మహబూబాబాద్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బానోతు దేవేందర్ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వద్దకు ప్రైవేట్ కళాశాలల యజమాన్యం వెళ్లి విద్యార్థుల సమాచారం తీసుకొని వారి అనుమతి లేకుండా అడ్మిషన్లు చేసి ఫీజు కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 1, 2025

మాజీ సీఎం కేసీఆర్‌కు పెండ్లి ఆహ్వాన పత్రిక

image

మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ దంపతులకు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం తన మనవడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. పెండ్లికి సకుటుంబ సమేతంగా రావాలని కేసిఆర్‌ను ఈ సందర్భంగా ఆయన కోరారు. పెండ్లికి తప్పకుండా వస్తానని మాజీ ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు.

News March 1, 2025

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పై 25% రాయితీ: జిల్లా కలెక్టర్

image

శుక్రవారం సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 31వ తేదీతో లే అవుట్ల దరఖాస్తుల రుసుము చెల్లించే గడువు ముగుస్తుందన్నారు.

News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

image

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.

error: Content is protected !!