News April 5, 2025
MHBD: భద్రాచలానికి RTC ప్రత్యేక బస్సులు

భద్రాచలంలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మహబూబాబాద్ డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈనెల నెల 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లే మహబూబాబాద్ పరిసర ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News April 5, 2025
సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ వివరాలు.. గరిడేపల్లి మండలం కల్మల్చుర్వు గ్రామానికి చెందిన సైదులు(53) హనుమంతులగూడెంకి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘనటలో సైదులు స్పాట్లోనే మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News April 5, 2025
సమసమాజ స్థాపన కోసం తపించిన బాబూజీ

బాబు జగ్జీవన్ రాం బిహార్లోని చంద్వాలో 1908లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే కుల వివక్షపై పోరాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, స్వాతంత్య్రం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారు. కేంద్రంలో 30 ఏళ్లపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. ఉపప్రధానిగా పని చేశారు. బాబూజీగా ప్రసిద్ధి చెందిన ఆయన దళితుల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం పోరాడారు. నేడు జగ్జీవన్ రాం 117వ జయంతి.
News April 5, 2025
ములుగు వాసులూ.. APPLY చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను ములుగు జిల్లాలోని మీ MPDO ఆఫీస్లో ఇవ్వాలి. SHARE