News August 28, 2025
MHBD: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం ఉదయం అన్ని శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాలు, గ్రామాలలో వర్ష సూచనలపై అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రజలకు విస్తృత ప్రచారం (టామ్ టామ్), స్థానిక వాట్సప్ గ్రూపుల ద్వారా అందించి అప్రమత్తం చేయాలన్నారు. ఎలాంటి పశుసంపద, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News August 28, 2025
పరిగి: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతం పరిశీలన

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని గురువారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించారు. ప్రాజెక్ట్ ఎంత విస్తరణ ఎలా ఉంటుందో మ్యాప్‌లో పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. త్రివేణి సంగమంగా మూడు స్టోర్లను ఏర్పాటు చేసుకుని, రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 4 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించనున్నట్లు తెలిపారు.
News August 28, 2025
అప్పులు తీర్చలేక ఒకరి ఆత్మహత్య: జైపూర్ ఎస్ఐ

జైపూర్ మండలం గంగిపల్లికి చెందిన సంపత్ అనే కూలి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని SI శ్రీధర్ చెప్పారు. సంపత్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో నిర్మాణానికి కొంత అప్పులు చేశాడన్నారు. అప్పులు తీర్చడానికి అతడి దగ్గర డబ్బులు లేకపోయేసరికి వాటిని ఎలా కట్టాలో మదనపడుతూ ఈనెల 26న వెలిశాల మల్లన్న గుడి దగ్గర పురుగు మందు తాగి మరణించాడని చెప్పారు. భార్య సంకీర్తన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
News August 28, 2025
మందమర్రి: సైబర్ నేరగాళ్ల మోసానికి గురైన మహిళ

సైబర్ నేరగాళ్ల మోసానికి గురైన ఓ మహిళ రూ.6.37 లక్షలను పోగొట్టుకున్నట్లు SI రాజశేఖర్ చెప్పారు. SI తెలిపిన వివరాలు.. మందమర్రికి చెందిన మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో THAW and REPAIR ప్రకటన చూసి పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మి, సంబంధిత టెలిగ్రామ్ యాప్‌లో చేరింది. మొదటగా బాధితురాలి ఖాతాలో రూ.5 వేలు జమైనట్లు చూపించారు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా రూ.6.37 లక్షలు పెట్టి, పోగొట్టుకుంది.