News November 28, 2025

MHBD: భూమి పేరు మార్పిడికి లంచం డిమాండ్

image

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ <<18414245>>లంచం<<>> తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. పోచంపల్లి పడమటి తండాకు చెందిన రైతు భూక్య బాలు తండ్రి పేరిట ఉన్న 3.09 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చడానికి తహశీల్దార్ రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

Similar News

News November 28, 2025

వనపర్తి: చిన్న నీటి వనరుల గణనకు శిక్షణ

image

వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో చిన్న తరహా నీటి వనరుల గణన కోసం ఎన్యూమరేటర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ హరికృష్ణ, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, అదనపు కలెక్టర్ శ్రావ్య పాల్గొని సూచనలు చేశారు. కేంద్ర జల వనరుల శాఖ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ ఎన్యూమరేషన్‌ను జాగ్రత్తగా పూర్తి చేయాలని వారు కోరారు. ఈ శిక్షణకు ఏఈవోలు, జీపీవోలు, ఎఫ్‌ఏలు, టీఏలు హాజరయ్యారు.

News November 28, 2025

స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

image

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్‌లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్‌లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్‌’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్‌ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.

News November 28, 2025

కడప జిల్లా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు

image

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.