News January 27, 2025

MHBD: మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులు

image

రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు నేటితో ముగిసింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీలకు ప్రత్యేక పాలనాధికారిగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్‌ను నియమించారు. కొత్త పాలకవర్గం కొలువు తీరేవరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని సర్కులర్ జారీ చేశారు.

Similar News

News November 11, 2025

హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి: మంత్రి

image

హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు అంశంపై కలెక్టర్ సిరితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News November 11, 2025

గ్రామీణ యువత స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి – కలెక్టర్

image

గ్రామీణ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి, శిక్షణా అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో విజయవంతమైన వ్యవస్థాపకులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రామీణ స్వయం ఉపాధి, శిక్షణా సంస్థను సోమవారం ఆయన ప్రారంభించారు. గ్రామీణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News November 11, 2025

ఖమ్మం: ఆయిల్ పామ్ పంట రైతులకు అధిక లాభాలు: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సహకార సంఘాల డైరెక్టర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆయిల్ పామ్ లాభసాటి పంట అని అన్నారు. వరి, పత్తి, మిర్చి పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరాకు రూ.50వేల సబ్సిడీతో పాటు ప్రభుత్వం డ్రిప్, నిర్వహణ ఖర్చులకు సహాయం అందిస్తుందని ఈ సంవత్సరం జిల్లాకు 14,500 ఎకరాల సాగు లక్ష్యం ఉన్నట్లు తెలిపారు.