News April 8, 2025

MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.

Similar News

News April 17, 2025

ఆసిఫాబాద్ కలెక్టర్ నేటి పర్యటన వివరాలు

image

 ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గురువారం వాంకిడి మండలంలో పర్యటిస్తారని MRO రియాజ్ అలీ తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మండలకేంద్రంలోని రైతువేదికలో భూ భారతీ 2025 మీద అవగాహన సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు.  సదస్సుకు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), RDO తదితర ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 17, 2025

గద్వాల: క్రికెట్ బెట్టింగ్.. ఏడుగురిపై కేసు నమోదు

image

తనగల గ్రామానికి చెందిన వీరేంద్ర ఆచారి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం మేరకు వడ్డేపల్లి ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వీరేంద్రతో పాటు మరో ఆరుగురిపై విచారణ జరిపి కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో క్రికెట్ బెట్టింగ్ ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో బెట్టింగ్ ఆడేవారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.

News April 17, 2025

నాగర్‌కర్నూల్: భూభారతి నిర్వహణలో రెవెన్యూ శాఖ కీలకం: కోదండరెడ్డి

image

భూభారతి నిర్వహణలో రెవెన్యూ శాఖ కీలకమని, భూ భారతి చట్టంపై మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ , రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో భూ భారతి చట్టం పై, రెవెన్యూ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

error: Content is protected !!