News August 21, 2025

MHBD: యూరియా సరఫరా కొరత.. రైతుల నిరాశ

image

MHBDలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్దకు రైతులు టోకెన్ల కోసం వచ్చారు. అయితే, రాత్రి పొద్దుపోయే వరకు కూడా టోకెన్లు ఇవ్వకపోవడంతో వారు పడిగాపులు పడి నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు టోకెన్లు ఇవ్వకపోవడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి యూరియా అందించకపోవడంతో ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు.

Similar News

News August 22, 2025

నేటి ముఖ్యాంశాలు

image

*AP: రూ.904 కోట్లతో అమరావతిలో మౌలిక వసతులు
*AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త పోస్టుల మంజూరు
*TG: పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర
*కాళేశ్వరం నివేదిక రద్దుకు KCR పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా
*మరోసారి జంగ్ సైరన్ మోగించిన TG ఉద్యోగ సంఘాల JAC
*రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ షురూ
*GSTలో 2 శ్లాబుల(5%, 18%) విధానానికి మంత్రుల బృందం ఆమోదం
*ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం: మోదీ

News August 22, 2025

పవన్ కళ్యాణ్ సూచన.. CBN అభినందనలు

image

AP: ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. నాలా చట్టసవరణపై చర్చిస్తుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్చేటప్పుడు లభించే ఆదాయం పంచాయతీలకు అందేలా చూడాలని, తద్వారా పంచాయతీలు బలోపేతం అవుతాయని చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మంచి సూచన చేశారని పవన్‌ను అభినందించారు. పవన్ సూచనలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News August 22, 2025

వేములవాడలో మహా లింగార్చన పూజ

image

మాస శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం మహా లింగార్చన పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జ్యోతులను లింగాకారంలో వెలిగించి, ప్రత్యేక పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. మాస శివరాత్రి రోజున మహా లింగార్చన పూజను దర్శించుకుంటే సకల దోషాలు తొలగి పుణ్యఫలాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు. ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.