News August 23, 2025
MHBD: రైతులు ఎవరు కుడా ఆందోళన చెందవద్దు: DAO

జిల్లా రైతులకు ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాలో 21,042 మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేసినట్లు DAO విజయనిర్మల తెలిపారు. యూరియా సప్లై రెగ్యులర్‌గా వస్తుంది కాబట్టి ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. గతంతో పోలిస్తే 200మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చిందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవొద్దన్నారు.
Similar News
News August 23, 2025
ఫైనల్‌కు దూసుకెళ్లిన తుంగభద్ర వారియర్స్

APL క్వాలిఫయర్-2లో భీమవరం బుల్స్‌పై తుంగభద్ర వారియర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ వైజాగ్‌లో జరిగే ఫైనల్లో అమరావతి రాయల్స్‌తో తలపడనుంది. తొలుత భీమవరం ఓవర్లన్నీ ఆడి 183/5 పరుగులు చేసింది. తోట శ్రవణ్ (71*) రాణించారు. అనంతరం 19 ఓవర్లలోనే 5 వికెట్ల కోల్పోయి తుంగభద్ర లక్ష్యాన్ని ఛేదించింది. గుట్ట రోహిత్ (87) విధ్వంసం సృష్టించారు.
News August 23, 2025
సురవరం మృతిపై CM రేవంత్, KCR దిగ్భ్రాంతి

TG: కమ్యూనిస్ట్ అగ్ర నేత <<17489686>>సురవరం సుధాకర్ రెడ్డి<<>> మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతి యావత్ దేశానికే తీరని లోటు అని పేర్కొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, కోమటిరెడ్డి, రాజనర్సింహ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
News August 23, 2025
MHBD: 55 ప్రీ ప్రైమరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో 55 ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా తాత్కాలిక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజేందర్ తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్‌మీడియట్ అర్హతతో నెలకు రూ.8 వేలు, ఆయాకు 7వ తరగతి అర్హతతో రూ.6 వేల వేతనం ఉంటుందన్నారు. ఆసక్తిగల మహిళలు జిల్లా విద్యా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.