News October 14, 2025
MHBD: లిక్కర్ షాపులకు 113 దరఖాస్తులు

మహబూబాబాద్ జిల్లాలో లిక్కర్ షాపులకు మొత్తం 113 దరఖాస్తులు వచ్చినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. సోమవారం ఒక్క రోజే 56 దరఖాస్తులు వచ్చాయన్నారు. మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్‌లో ఆదివారం 25 దరఖాస్తు రాగ మొత్తం 59 దరఖాస్తులు వచ్చాయని సీఐ తెలిపారు. లిక్కర్ షాపులకు దరఖాస్తులకు ఈనెల 18న గడువు ముగుస్తుందన్నారు.
Similar News
News October 14, 2025
సిర్పూర్ టీ: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

మద్యానికి బానిసై పురుగు మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్ వివరాలు.. మండలంలోని మాకిడి గ్రామానికి చెందిన తంగే బాలాజీ మద్యానికి బానిసై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 14, 2025
MDK: అమరవీరులను స్మరించుకుంటూ వ్యాసరచన పోటీలు: ఎస్పీ

మెదక్ జిల్లాలోని పోలీస్ ఫ్లాగ్ డే (అక్టోబర్ 21) సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకునే ఉద్దేశంతో ఈ ఆన్‌లైన్ పోటీలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని ఎస్పీ సూచించారు.
News October 14, 2025
బ్రహ్మపుత్రపై రూ.6.4 లక్షల కోట్లతో ప్రాజెక్ట్

బ్రహ్మపుత్ర నదిపై రూ.6.4 లక్షల కోట్లతో హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2047కల్లా 76 గిగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీతో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ ప్లాన్‌లో ఈశాన్య రాష్ట్రాల్లోని 12 సబ్ బేసిన్లలో 208 పెద్ద హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి ద్వారా 64.9GW పొటెన్షియల్ కెపాసిటీ, 11.1GW పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ నుంచి జనరేట్ చేయొచ్చని పేర్కొంది.