News September 4, 2025
MHBD: విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి: కలెక్టర్

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఆయన గుమ్మడూరు గురుకుల బాలుర పాఠశాలను తనిఖీ చేసి, వంటగదులను పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయాలని, విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News September 4, 2025
వరంగల్: నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు

అధిక సి-సెక్షన్లు చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు పాటించిన ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని, రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
News September 4, 2025
పిడూరుమిట్టలో విషాదం.. నిమజ్జనోత్సవంలో బాలుడు మృతి

మనుబోలు మండలం పిడూరుమిట్టలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నన్నూరు జస్వంత్ కుమార్ (16) పది చదువుతున్నాడు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో వినాయక బొమ్మను ఏర్పాటు చేసి బుధవారం ఉదయం బొమ్మను సముద్రంలో నిమజ్జనం చేయుటకు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం శ్రీనివాస సత్రంనకు బయలుదేరి వెళ్లారు. సముద్రంలో నిమజ్జనం చేస్తుండగా జస్వంత్ కుమార్ పడిపోయి చనిపోయాడు. ఎస్సై శివ రాకేశ్ విచారణ చేపట్టారు.
News September 4, 2025
చేగుంట వద్ద ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన

చేగుంట వద్ద వడియారం, మాసాయిపేట స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నెం. 228 స్థానంలో ఆర్‌ఓబీ, ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణానికి ఈనెల 4న ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, అంజిరెడ్డి, కొమురయ్య, రైల్వే అధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. దీంతో ఆర్ఓబీ ట్రాఫిక్ సమస్య తీరనుంది.