News December 21, 2025
MHBD: సర్పంచ్ ప్రమాణ స్వీకార పత్రం.. ఇలా చేయాలి!

22న జరిగే సర్పంచుల ప్రమాణ స్వీకార పత్రం ఈ విధంగా ఉంది. గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికైన నేను.. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం, ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018, దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం, నా విధులు, బాధ్యతలను భయమో, పక్షపాతమో లేకుండా, నిష్ఠతో నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
Similar News
News December 21, 2025
MBNR: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో MBNR జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచినట్లు పేర్కొన్నారు. “వేడుకలు జరుపుకోవడం అందరి హక్కే.. కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు” అని ఆమె స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 21, 2025
ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది: KCR

TG: పంచాయతీ ఎన్నికల్లో BRS మెరుగైన ఫలితాలు సాధించిందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్శించలేదన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే BRS సత్తా తెలిసేదని తెలిపారు. తనను తిట్టడం, తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అని విమర్శించారు.
News December 21, 2025
జాతీయ స్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు

ఈనెల 27 నుంచి 30 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరగబోయే 50వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ & జూనియర్ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జిల్లా ఒలింపిక్ సంఘం సీఈఓ విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడారు.


