News October 9, 2025
MHBD: స్థానిక అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు!

మహబూబాబాద్ జిల్లాలో రెండు విడతల్లో రానున్న స్థానిక సమరంలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న స్థానిక ఎన్నికలు ఎట్టకేలకు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 193 ఎంపీటీసీ, 18 జడ్పీటీసీ స్థానాలకు అన్ని పార్టీల అభ్యర్థులు తలపడనున్నారు. ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Similar News
News October 9, 2025
ప్రేమ భద్రంగా ఉండేందుకు తాళం వేసేవారు!

పారిస్‌లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిపై ప్రేమకు చిహ్నంగా తాళాలు వేసే సంప్రదాయం (గుళ్లలో ముడుపుల మాదిరిగా) ఉండేది. తమ ప్రేమ శాశ్వతం కావాలని కోరుకునే జంటలు ఇక్కడ లాక్ చేసి, కీలను సీన్ నదిలో పడేసేవారు. అయితే తాళాల బరువుతో వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని పారిస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. 2015లో తాళాలను తొలగించి, వాటి స్థానంలో గాజు ప్యానెళ్లను అమర్చింది. ప్రస్తుతం ఇక్కడ తాళాలు వేయడం పూర్తిగా నిషేధం.
News October 9, 2025
నర్మేట: పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య

నర్మేట మండలం గండిరామవరం గ్రామానికి చెందిన వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ముక్కెర లావణ్య(30) గురువారం ఉదయం ఇంట్లో పురుగు మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతిరాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
News October 9, 2025
ములుగు: ‘తక్షణమే వేతనాలు చెల్లించాలి’

ములుగు జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జాకారం, ఏటూరునాగారం బాలుర, ములుగు బాలికల భోధన సిబ్బంది, పార్ట్ టైం టీచర్స్ గత 3 నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా బోధన, బోధనేతర విధులను తక్కువ వేతనంతో నిర్వహిస్తున్నామని వాపోయారు. మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని ములుగు డీసీవో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు.