News March 4, 2026
MHBD: స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి నేడే చివరి తేదీ

క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సం.కి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేది అని మహబూబాబాద్ జిల్లా క్రీడాధికారిని ఓలేటి జ్యోతి తెలిపారు. ఈ నెల 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు tgss.telangana.gov.in చేసుకోవాలన్నారు.
Similar News
News March 4, 2026
కృష్ణా: 16 నుంచి ‘పది’ పరీక్షలు.. హాల్ టికెట్లు విడుదల

పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు బుధవారం విడుదలయ్యాయి. జిల్లా విద్యాశాఖాధికారి UV సుబ్బారావు తెలిపారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంటాయని, అనధికారిక సైట్లను నమ్మవద్దని హెచ్చరించారు. bre.ap.gov.in, Mana Mitra WhatsApp Governance 95523 00009 ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
News March 4, 2026
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,568 పాయింట్లు కుంగి 78,669 వద్ద, నిఫ్టీ 476 పాయింట్లు క్షీణించి 24,388 దగ్గర ట్రేడవుతోంది. ఇన్ఫీ, BEL, HCL టెక్ షేర్లు లాభాల్లో.. LT, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, M&M, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92 మార్క్ దాటి ఆల్‌టైం కనిష్ఠాన్ని తాకింది.
News March 4, 2026
తిరుపతి: భారీగా పెరిగిన ధరలు.. కిలో రూ. 100

ఎండలు భగ్గుమన్న వేళ నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ భారీగా పెరగడంతో మన ప్రాంత నిమ్మకాయలకు మంచి మార్కెట్ దక్కుతోంది. ప్రస్తుతం కిలో నిమ్మకాయలు వంద వరకు పలుకుతుండటంతో బాలాయపల్లె రైతులకు లాభాలు చేకూరుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం, నిమ్మరసం వినియోగం అధికమవడం వల్లే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుందని వ్యాపారులు చెబుతున్నారు.


