News April 3, 2025
MHBD: హత్య కేసును ఛేదించిన పోలీసులు

MHBDలో జరిగిన <<15975323>>హత్య<<>> కేసును పోలీసులు చేధించారు. SP సుదీర్ రామ్నాథ్ వివరాలు.. పార్థసారథి అతడి భార్య స్వప్న మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో స్వప్న ఆమె ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి నలుగురు దుండగులకు రూ.5లక్షలు సుపారి ఇచ్చి మంగళవారం దంతలపల్లికి డ్యూటీకి వెళ్తున్న పార్థసారథిని హత్య చేయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్వప్న, విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. కాగా హత్య చేసిన నలుగురు పరారీలో ఉన్నారు.
Similar News
News November 5, 2025
మెదక్‌లో రేపటి నుంచి 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 జోన్-III(బాలికలు) 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ క్రీడాపోటీలు ఈ నెల 6 నుండి 8 వరకు జరుగుతాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. మెదక్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల(ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర) వేదికగా ఈ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News November 5, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు
> జనగామ, సిద్దిపేట హైవేపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాస్తారోకో
> చీటకోడూరు బ్రిడ్జి వద్ద బీజేపీ నేతల నిరసన
> జిల్లా వ్యాప్తంగా నల్ల నరసింహులు వర్ధంతి
> పాలకుర్తిలో వెలిగిన అఖండ జ్యోతి
> గాడిదలు, దున్నపోతులతో నిరసన తెలుపుతాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
> జనగామ: బిక్షాటనతో ఎస్ఎఫ్ఐ నేతల నిరసన
> బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే యశస్విని
News November 5, 2025
‘మీ డబ్బు- మీ హక్కు’ గోడ పత్రిక ఆవిష్కరణ

పది ఏళ్లు అంతకు మించి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్మును బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మీ డబ్బు- మీ హక్కు నినాదంతో భారత ప్రభుత్వం మూడు నెలల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంపై రూపొందించిన గోడ పత్రికను బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో ఆయన ఆవిష్కరించారు. కాకినాడ జిల్లాలో 5,88,521 బ్యాంకు ఖాతాల్లో రూ.101.22 కోట్లు సొమ్మును తిరిగి పొందవచ్చన్నారు.


