News October 8, 2025
MHBD: హెడ్మాస్టర్‌కు పాముకాటు

పాఠశాలలో ఉపాధ్యాయురాలికి పాము కాటు వేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొడిసెల మిట్ట ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ పి. సరితకు మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం వెంటనే గంగారం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని గ్రామస్థులు తెలిపారు.
Similar News
News October 8, 2025
పసికందు మృతి ఘటనలో ఐసీడీఎస్ పీడీ సస్పెండ్

అనంతపురంలోని శిశు గృహంలో శిశువు ఆకలితో మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న అభియోగంతో ఐసీడీఎస్ పీడీ నాగమణిని అధికారులు సస్పెండ్ చేశారు. జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా మరికొందరు కాంట్రాక్ట్ అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కలెక్టర్ ఆనంద్ నేడో, రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.
News October 8, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపురం, నందరాడ మధ్య మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రాజానగరం సుబ్బారావు కాలనీకి చెందిన సత్యనారాయణ బైక్‌పై కోరుకొండ నుంచి తిరిగి వస్తుండగా, నందరాడ దాటిన తర్వాత కొవ్వూరుకు చెందిన శ్రీనివాస్ మోటార్ బైక్‌ను బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
News October 8, 2025
EPFO కనీస పింఛన్ రూ.2,500కు పెంపు?

ఈపీఎఫ్‌వో చందాదారులకు కనీస పింఛన్ రూ.2,500కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10, 11న ట్రస్టీల భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పింఛను పెంపుపై నిర్ణయం తీసుకుంటే కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు రూ.7,500 ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.1,000 పింఛన్ అందుతోంది. 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీసు, 58 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఇందుకు అర్హులు.