News February 13, 2026
MHBD: 17వ వార్డులో ఛైర్మన్ అభ్యర్థిపై BRS గెలుపు

మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను అధికారులు వెల్లడిస్తున్నారు. మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ బలపరిచిన 17వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి నరేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన బాలు చౌహాన్‌పై 22 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీఆర్ఎస్ గెలుపుతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News March 13, 2026
పూతలపట్టు: పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయిన దొంగ

పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఓ బైక్ దొంగను స్థానికులు పట్టుకున్నారు. రంగంపేట క్రాస్‌కు చెందిన హరిబాబు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసి తీసుకెళ్లాడు. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా.. పెట్రోల్ అయిపోవడంతో ఆ దొంగ బైక్‌ను తోసుకుంటూ పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నట్లు తెలిసింది. వెంటనే స్థానికుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.
News March 13, 2026
రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.
News March 13, 2026
వరంగల్: టెన్త్ పరీక్షలకు గ్యాస్ కష్టాలు!

వారం రోజుల్లో ముగించాల్సిన పది పరీక్షలను నెల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల 13 వరకు పరీక్షలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఒక్కో పరీక్షకు 5 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఇరాన్ యుద్దంతో ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. మరో నెల పాటు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,17,727 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో సగం మంది హస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.


