News December 2, 2025
MHBD: 3వ విడత ఎన్నికల వివరాలు..!

జిల్లాలో 3వ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలు 169, వార్డులు 1,412 ఉన్నాయి. డోర్నకల్ మండలంలో 26 గ్రామాలు, 218 వార్డులు, గంగారం 12 గ్రామాలు, 100 వార్డులు, కొత్తగూడ 24 గ్రామాలు, 202 వార్డులు, కురవి 41 గ్రామాలు, 344 వార్డులు, మరిపెడ 48 గ్రామాలు,396 వార్డులు, సీరోల్ 18 గ్రామాలు, 152 వార్డులు ఉన్నాయి. 3వ విడత నామినేషన్లు ఈ నెల 3న, ఎన్నికలు 17న జరగనున్నాయి.
Similar News
News December 3, 2025
ధర్మశాస్తా దర్శనం: ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే?

అయ్యప్ప స్వాములు ఇరుముడితో 18 మెట్లు దాటిన తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శిస్తారు. అనంతరం మణి మండపం, మహా గణపతి, సర్పరాజు వద్ద ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత చిన్ముద్ర ధారియైన అయ్యప్ప దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుంటారు. ఆ స్వరూపాన్ని గుండెల్లో నింపుకొని, ఇరుముడిని స్వామికి చూపిస్తారు. నెయ్యభిషేకం చేయిస్తారు. చివరగా మాలికపురత్తమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. <<-se>>#AyyappaMala<<>>
News December 3, 2025
VJA: నేడు సిట్ ముందుకు వైసీపీ నేతల కుమారులు

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు నేడు విచారణకు హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. జోగి రాజీవ్, రోహిత్ కుమార్, రాకేశ్, రామ్మోహన్‌కు నోటీసులు అందించారు. ఈ మేరకు గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వారు విచారణకు హాజరు కానున్నారు. లాప్‌టాప్‌లోని సమాచారం కోసం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
News December 3, 2025
‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పోస్టర్ ఆవిష్కరణ

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర సైబర్ విభాగం రూపొందించిన ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. సైబర్ నేరాల నియంత్రణకై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ విభాగం పోలీసు అధికారులు పాల్గొన్నారు.


