News October 27, 2025

MHBD: 61లిక్కర్ షాపులకు లక్కీ పర్సన్స్ ఎవరో..!

image

మహబూబాబాద్ జిల్లాలో 61 లిక్కర్ షాపులు ఉన్నాయి. ఈ నెల 23న లిక్కర్ షాపులకు దరఖాస్తుల గడువు ముగిసింది. జిల్లాలో 61 లిక్కర్ షాపులకు 1800 దరఖాస్తులు అందాయి. AB ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు. లక్కీ డ్రా లో 61 లక్కీ పర్సన్స్ ఎవరనేది తేలనున్నది. కొత్త లిక్కర్ షాపులను కేటాయించనున్నారు.

Similar News

News October 27, 2025

MBNR: కురుమూర్తి జాతర.. ప్రత్యేక బస్సులు

image

కురుమూర్తి జాతర సందర్భంగా మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. నేటి నుంచి ఈనెల 30 వరకు కురుమూర్తి జాతర నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

News October 27, 2025

ప్రాణాంతక ‘కుందేటి వెర్రి వ్యాధి’.. చికిత్స

image

రక్త పరీక్ష ద్వారా పశువుల్లో కుందేటి వెర్రి వ్యాధిని గుర్తిస్తారు. వెటర్నరీ డాక్టర్ల సూచన మేరకు పశువు శరీర బరువును బట్టి, సురామిన్, క్వినాపైరమిన్‌, డైమినాజిన్ అసేట్యూరేట్, ఐసోమోటాడియమ్ క్లోరైడ్ ఇంజెక్షన్లను వాడవచ్చు. అలాగే వ్యాధి సోకిన పశువులను విడిగా ఉంచాలి. షెడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు కుట్టకుండా తెరలను ఉపయోగించాలి. పశువులకు శుభ్రమైన నీరు, మేత అందించాలి.

News October 27, 2025

కార్తీక సోమవారం: శివుణ్ని ఎలా పూజించాలంటే?

image

కార్తీక మాసంలో సోమవారానికి అత్యంత విశిష్టత ఉంది. ఈరోజు పొద్దున్నే లేచి, చన్నీటి స్నానం చేసి, దీపారాధన చేయాలి. నిత్య పూజానంతరం కార్తీక పురాణం పఠించాలి. ఫలితంగా విశేష ఫలితాలుంటాయి. భక్తులు శివుడిని బిల్వ దళాలతో పూజించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుంది. ‘హర హర మహాదేవ శంభో శంకర’ నామస్మరణ చేస్తూ శివాలయాన్ని సందర్శించాలి. సోమవారం చంద్రుడికి ప్రీతికరమైనది కాబట్టి, చంద్రుడిని పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది.