News April 13, 2025

MHBD : BRS సిద్ధమా.. పూర్వవైభవం వచ్చేనా..?

image

రాష్ట్రంలో పదవి కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ శ్రేణులతో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్ దిశానిర్దేశం చేశారు. సభతో BRSలో జోష్ వస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.

Similar News

News April 17, 2025

రేపు తిరుపతికి పవన్ కళ్యాణ్ రాక.?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం తిరుపతికి రానున్నట్లు సమాచారం. టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. గోవులను పవన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు.

News April 17, 2025

భూపాలపల్లిలో సైబర్ నేరాలపై ఎస్పీ హెచ్చరిక

image

భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ ఏజెన్సీల పేరిట ప్రజలను భయపెడుతున్నారని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించే ఆశ చూపి మోసం చేస్తున్నారని తెలిపారు. OTP ఎవరితోనూ పంచుకోవద్దని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 17, 2025

YCP హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు: కూటమి నేతలు

image

AP: ఎస్వీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కూటమి నేతలు విమర్శించారు. తాము గోశాల వద్దకు వచ్చామని, భూమనతో సహా ఇతర వైసీపీ నేతలెవరూ ఇక్కడికి రాలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

error: Content is protected !!